పోలీస్ పాత్రలో ఆర్ఎక్స్100 బ్యూటీ..!

|

Feb 19, 2019 | 10:51 AM

లేడి ఓరియెంటెడ్ సినిమాలంటే తక్కని గుర్తొచ్చేది లేడి సూపర్ స్టార్ నయనతార. కామెడీ నుంచి హారర్ దాకా ఏ జోనర్ అయినా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్స్ లేడి ఓరియెంటెడ్ సినిమాలంటేనే వెనకడుగు వేసేవారు. అలాంటిది ఇప్పుడు అందరూ కూడా లేడి ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవల ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే […]

పోలీస్ పాత్రలో ఆర్ఎక్స్100 బ్యూటీ..!
Follow us on

లేడి ఓరియెంటెడ్ సినిమాలంటే తక్కని గుర్తొచ్చేది లేడి సూపర్ స్టార్ నయనతార. కామెడీ నుంచి హారర్ దాకా ఏ జోనర్ అయినా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్స్ లేడి ఓరియెంటెడ్ సినిమాలంటేనే వెనకడుగు వేసేవారు. అలాంటిది ఇప్పుడు అందరూ కూడా లేడి ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవల ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పిందట.

అసలు విషయంలోకి వెళ్తే కొత్త దర్శకుడు పరందీప్ పాయల్ కి ఒక లైన్ చెప్పాడట. అది పాయల్ కి బాగా నచ్చడంతో ఓకే చెప్పిందని వినికిడి. ఇందులో పాయల్ రాజ్ పుత్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతోందట. ఇక అమ్మడు అప్పుడే ఈ రోల్ కోసం జిమ్ లో వర్కవుట్స్ కూడా చేస్తోందట.

హీరో రవితేజతో డిస్కో రాజా, నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ పోలీస్ గా అభిమానులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.