
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా విజయంతో ఆయనకు వరుస పెట్టి ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. అయితే ఈ దర్శకుడి రెండో సినిమా మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. గతంలో హీరో రామ్ అని, బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్ అని ఇలా పలువురు యంగ్ హీరోల పేర్లు వినబడినా.. అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి తప్ప ఏదీ స్టార్ట్ కాలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక వీటిపై డైరెక్టర్ అజయ్ భూపతి ఘాటుగా స్పందిస్తూ తన రెండో చిత్రం ఎప్పుడు, ఎవరితో తీయాలో తనకు తెలుసని.. ఇలాంటి చెత్త రూమర్స్ క్రియేట్ చేయవద్దని అన్నాడు.
Naa rendo cinema eppudu,evaritho,elaa teeyalo naaku telusu
Plz stop the rumors— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 30, 2019