అతడిని హీరోగా వద్దని చెప్పిన ఎన్టీఆర్‌!

ఇటీవల కాలంలో ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టిన పుకార్లలో ఒకటి ఎన్టీఆర్ బావమరిది(లక్ష్మీ ప్రణతి సోదరుడు) నార్నే నితిన్‌ హీరోగా రావాలనుకోవడం.

అతడిని హీరోగా వద్దని చెప్పిన ఎన్టీఆర్‌!

Edited By:

Updated on: Aug 22, 2020 | 10:36 AM

NTR said no to Nithin: ఇటీవల కాలంలో ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టిన పుకార్లలో ఒకటి ఎన్టీఆర్ బావమరిది(లక్ష్మీ ప్రణతి సోదరుడు) నార్నే నితిన్‌ హీరోగా రావాలనుకోవడం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలైనట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇప్పటికే డ్యాన్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, నటనలో నితిన్ శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ఫైనల్‌ గ్రీన్ సిగ్నల్ కోసం ఎన్టీఆర్‌ని కలవగా.. నితిన్ ఎంట్రీకి ఆయన బ్రేక్‌లు వేసినట్లు సమాచారం. హీరోగా వద్దని నితిన్‌కి, ఎన్టీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

హీరోగా రాణించడం అన్నది కత్తి మీద నడకలాంటిదని, కాస్త బ్యాలెన్స్ తప్పినా ఆ ఎఫెక్ట్ కెరీర్ మొత్తం మీద పడుతుందని ఎన్టీఆర్‌, నితిన్‌కి సూచించినట్లు టాక్‌. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో కాంపిటేషన్‌ చాలా ఉందని, ఇలాంటి సమయంలో హీరోగా రాకపోవడమే మంచిదని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. నితిన్‌పై నమ్మకం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఈ మేరకు సూచనలు చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? నితిన్‌ ఎంట్రీ ఇక లేనట్లేనా..? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్‌, ఈ మూవీ తరువాత త్రివిక్రమ్‌, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు.

Read More:

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

చెన్నైలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం