RRR Movie Collections: అడ్వాన్స్ బుకింగ్ తోనే సంచలనాలు సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాక్సాఫీస్ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్లు రాబడుతోంది. గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. అంతేకాదు చాలా చోట్ల బాహుబలి రికార్డులను చెరిపేసిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రూ.1000 కోట్ల మార్క్‌ను సులభంగా అందుకుంటుందంటున్నారు.
కాగా నార్త్‌లోనూ జక్కన్న సినిమా రూ. 100 కోట్లను క్రాస్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.300కోట్ల మార్క్‌కు చేరువవుతోంది. ఓవర్సీస్‌లోనూ ఇప్పటివరకు రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరి బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో సందడి చేసింది. హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ. 450 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
#RRRMovie WW Box Office
ENTERS ₹700 cr club in just 7 days.
Day 1 – ₹ 257.15 cr
Day 2 – ₹ 114.38 cr
Day 3 – ₹ 118.63 cr
Day 4 – ₹ 72.80 cr
Day 5 – ₹ 58.46 cr
Day 6 – ₹ 50.74 cr
Day 7 – ₹ 37.20 cr
Total – ₹ 709.36 cr— Manobala Vijayabalan (@ManobalaV) April 1, 2022
Also Read:Relationship: ఈ 5 కారణాల వల్ల అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. ఎందుకో తెలుసుకోండి..!
Sreemukhi: ఉగాది స్పెషల్.. ట్రెడిషనల్ లుక్ లో అందాల యాంకరమ్మ.. శ్రీముఖి క్యూట్ ఫోటోస్
Sreemukhi: ఉగాది స్పెషల్.. ట్రెడిషనల్ లుక్ లో అందాల యాంకరమ్మ.. శ్రీముఖి క్యూట్ ఫోటోస్