సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఫుల్ జోరు మీదున్నాడు రవితేజ. ఇటీవలే తన కొత్త సినిమా ‘ఖిలాడి’ షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు మాస్ మాహారాజా. తాజాగా తాను ఖిలాడి చిత్రీకరణలో జాయిన్ అయిన విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు రవితేజ.
లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ క్యాప్షన్ ఇస్తూ.. ఖిలాడి సెట్లో దిగిన సెల్ఫీని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక జనవరి 26న రవితేజ పుట్టినరోజు కావడంతో ఆ తేదీన ఖిలాడి టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Lights. Camera. Action.
From the sets of my next..#Khiladi ? pic.twitter.com/KxYQd6LsmP— Ravi Teja (@RaviTeja_offl) January 18, 2021
Also Read:
Krack Movie: హిందీలో రీమేక్ కాబోతున్న మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమా.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా ?
Vijay Setupati: పుట్టిన రోజు ఫొటో వివాదంపై స్పందించిన విజయ్ సేతుపతి… క్షమాపణలు చెబుతూ ట్వీట్..