Raveena Tandon allegations on Bollywood: హీరోలతో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టే తనకు అవకాశాలు ఎక్కువగా రాలేదని అన్నారు నటి రవీనా టాండెన్. తనకు అవకాశాలు రాకపోవడానికి తన అహంకారమే కారణమని చాలా మంది అనుకునేవారని, కానీ తనను ప్రమోట్ చేసేందుకు హీరోలు లేరని ఆమె తెలిపారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవీనా టాండెన్.. ”నాకు సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేరు. నేను ఏ క్యాంపులో లేను. నన్ను ప్రమోట్ చేసే హీరోలు కూడా లేరు. పాత్రల కోసం నేను హీరోల పక్కన పడుకోలేదు. వారితో అఫైర్ నడపలేదు. అంతేకాదు వారు కూర్చొమన్నప్పుడు కూర్చొవడం, నవ్వమన్నప్పుడు నవ్వడం నాకు చేత కాదు. అందుకే నన్ను అహంకారి అనుకునేవారు” అని వెల్లడించారు. ఇక మహిళా జర్నలిస్ట్‌లు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని, కెరీర్‌పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తనపై ఎన్నో తప్పుడు వార్తలు రాశారని ఆమె ఆరోపించారు. వారు కూడా హీరోలకు అనుగుణంగానే వార్తలను రాసేవారని అన్నారు. కాగా ఈ నటి ‘కేజీఎఫ్ 2’లో ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
Read This Story Also: రానా Weds మిహీక: ఎంతమంది ఆహ్వానితులంటే!