బాలీవుడ్‏లోకి అడుగుపెట్టనున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఫస్ట్‏లుక్ పోస్టర్‏ను షేర్ చేసిన ముద్దుగుమ్మ..

2018లో విడుదలైన 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ రష్మిక మంధన. అదే ఏడాదిలో రష్మిక నటించిన గీతగోవిందం, దేవదాస్ అలాగే 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా బాక్సాఫీసు

బాలీవుడ్‏లోకి అడుగుపెట్టనున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఫస్ట్‏లుక్ పోస్టర్‏ను షేర్ చేసిన ముద్దుగుమ్మ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2020 | 2:56 PM

2018లో విడుదలైన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ రష్మిక మంధన. అదే ఏడాదిలో రష్మిక నటించిన గీతగోవిందం, దేవదాస్ అలాగే 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసులు వర్షం కురింపించాయి. ఈ సినిమాలు హిట్ సాధించడంతో రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సంవత్సరంలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో బారీ విజయాలను అందుకున్న రష్మిక తాను బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

తాజాగా తాను నటించనున్న సినిమా ఫస్ట్‏లుక్ పోస్టర్‏ను రష్మిక షేర్ చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ‘మిషన్ మజ్ను’ గా ఖరారు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రకు జంటగా రష్మికను ఎంపికచేశారు. ‘మిషన్ మజ్ను సినిమాలో నేను కూడా ఓ భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఈ మూవీతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. భారత్ రా ఏజెన్సీ పాకిస్తాన్‏లో చేపట్టిన అత్యంత సాహసోపేతమైన మిషన్ కథతో మిషన్ మజ్ను సినిమా తెరకెక్కుతుంది’ అని రష్కిక తెలిపింది. అటు ఈ సినిమాకు షాంతను భాగ్చీ దర్శకత్వం వహిస్తున్నారు.