హైదరాబాద్: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా తెలుగు పరిశ్రమలో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు చిత్రంతో పాటు అల్లు అర్జున్ చిత్రం కూడా ఉన్నాయి. తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించిన ఆమె తెలుగుతో పాటు కన్నడ పరిశ్రమలో కూడా రెమ్యునరేషన్‌ను హైక్ చేసింది. ఒక్కో సినిమాకు 65 లక్షల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక ఈ విషయంపై కొందరు రష్మికను తప్పుబట్టారు. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ ‘ప్రతి ఒక్కరు తమ కెరీర్లో సమయానుకూలంగా ఎదుగుదల అన్నది కోరుకుంటారు. అందరిలానే నేను కూడా కోరుకున్నానంటూ గీతా మేడమ్ ప్రవచనాలు వల్లించింది. రెమ్యునరేషన్ పెంచడంలో ఎటువంటి తప్పులేదని తనని తాను సమర్ధించుకుంది రష్మిక మందన్నా.