
నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవల యానిమల్ మూవీలో గీతాంజలిగా మెప్పించి ఆకట్టుకుంది. తాజాగా రష్మిక మందన్న ఫిబ్రవరి 2024 ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకొని ఆశ్చర్యపర్చింది. 27 ఏళ్ల నటి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందుతుంది.
“పుష్ప: ది రైజ్” “యానిమల్” వంటి బ్లాక్ బస్టర్లలో అందర్నీ ఆకట్టుకుంది. రష్మిక ఇప్పటికే భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని తానేంటో ప్రూవ్ చేసుకుంది. అద్భుతమైన నలుపు రంగు స్లీవ్‌లెస్ దుస్తులు ధరించి, ఫోర్బ్స్ పబ్లికేషన్‌లో హోయలు ఒలకబోసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి “పుష్ప 2: ది రూల్”లో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సినిమా, క్రీడలు, మీడియా, ఫ్యాషన్ రంగాలకు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రభావితచేసిన వ్యక్తులను గుర్తించి జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో రష్మిక మందన్న టాప్ లో ఉండటం విశేషం. ఛలో సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. గీతగోవిందం, పుష్ప, యానిమల్ లాంటి హిట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోను ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఏమాత్రం సమయం దొరికినా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటుంది. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లిచేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నా.. జస్ట్ వీ ఆర్ ఫ్రెండ్స్ అంటూ రియాక్ట్ అవుతుందే తప్ప రిలేషన్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప పార్ట్-2 సినిమాతో బిజీగా ఉంది.
🥺🥺🥺❤️ @23_rahulr ✨✨ https://t.co/4foM2uWCNG
— Rashmika Mandanna (@iamRashmika) February 15, 2024