రానా ‘అరణ్య’కు విడుదల తేది ఖరారు.. థియేటర్లలో ఎంజాయ్ చేయండన్న టీమ్‌

| Edited By: Pardhasaradhi Peri

Oct 21, 2020 | 2:37 PM

అభిమానులకు రానా గుడ్‌న్యూస్ చెప్పారు. తాను నటించిన హాథీ మేరీ సాథీ(తెలుగులో అరణ్య, తమిళ్‌లో కాదన్‌)కు రిలీజ్ డేట్ ప్రకటించారు.

రానా అరణ్యకు విడుదల తేది ఖరారు.. థియేటర్లలో ఎంజాయ్ చేయండన్న టీమ్‌
Follow us on

Rana Aranya Movie: అభిమానులకు రానా గుడ్‌న్యూస్ చెప్పారు. తాను నటించిన హాథీ మేరీ సాథీ(తెలుగులో అరణ్య, తమిళ్‌లో కాదన్‌)కు రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో ఒక పగిలిన గోడ, ఏనుగులు, జలపాతం ఉండగా.. మూవీపై ఆసక్తిని మరింత పెంచింది.

కాగా ఈ మూవీలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్‌, శ్రియ పల్గావోంకర్ తదితులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించింది. శంతను మొయిత్రా సంగీతం అందించిన ఈ మూవీ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.

Read More:

Breaking: ‘ఎఫ్‌ 2’కు జాతీయ స్థాయి అవార్డు

‘విక్రమాదిత్య’గా ప్రభాస్‌.. ‘రాధే శ్యామ్’‌ సర్‌ప్రైజ్‌ అదిరిపోయిందిగా