Aranya Movie Update: సమ్మర్‏లో సందడి చేయనున్న రానా.. ‘అరణ్య” విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం 'అరణ్య'. ఈ సినిమాను హిందీలో 'హాథీ మేరే సాథీ'గా రూపొందుతుంది. ప్రభు సాలొమోన్

Aranya Movie Update: సమ్మర్‏లో సందడి చేయనున్న రానా.. 'అరణ్య విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2021 | 6:59 PM

బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ సినిమాను హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందుతుంది. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గతేడాది ఏప్రిల్‏లో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‏డౌన్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయోచ్చు అని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

తాజాగా రానా ప్రధాన పాత్రలో నటించిన అరణ్య సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. “కొత్త సంవత్సరాన్ని, మరియు సాధరణ పరిస్థితులకు స్వాగతం పలుకుతూ మార్చి 26న మీ సమీపంలో ఉన్న థియేటర్లలో హాథీ మేరే సాథీ/ అరణ్య/ కాండన్‏ను తీసుకువస్తున్నందుకు మేం చాలా సంతోషిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు రానా.

Also Read:  సంక్రాంతి బరిలో అక్కినేని యంగ్ హీరో.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎప్పుడొస్తున్నాడంటే.

ప్రభాస్‏తో జతకట్టనున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. ‘సలార్’‏లో నటించనున్న ఆ హాట్ బ్యూటీ ?