Ramabanam: ప్రతీ ఇంటి తలుపుతడుతోన్న రామబాణం చిత్ర యూనిట్‌.. ఇలాంటి మూవీ ప్రమోషన్‌ను ఎప్పుడు చూసి ఉండరు.

|

Apr 30, 2023 | 4:38 PM

గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం రామబాణం. లౌక్యం తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతోన్న గోపీచంద్‌ ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకొని చేశారు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న గోపీ చంద్‌ దర్శకుడు శ్రీవాస్‌తో చేతులు కలపనున్నాడు. ఇప్పటి వరకు సినిమా వచ్చిన ఫస్టలుక్‌, ట్రైలర్‌ చిత్రంపై...

Ramabanam: ప్రతీ ఇంటి తలుపుతడుతోన్న రామబాణం చిత్ర యూనిట్‌.. ఇలాంటి మూవీ ప్రమోషన్‌ను ఎప్పుడు చూసి ఉండరు.
Ramabanam
Follow us on

గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం రామబాణం. లౌక్యం తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతోన్న గోపీచంద్‌ ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకొని చేశారు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న గోపీ చంద్‌ దర్శకుడు శ్రీవాస్‌తో చేతులు కలపనున్నాడు. ఇప్పటి వరకు సినిమా వచ్చిన ఫస్టలుక్‌, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఇక సినిమాను మే5వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనుంది.

ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్‌లో రామబాణం చిత్రయూనిట్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్‌లో సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే పాల ప్యాకెట్ల ద్వారా సినిమా ప్రమోషన్‌ చేస్తున్నారు. ఓ ప్రముఖ పాల ప్యాకెట్‌లపై రామబాణం పోస్టర్‌తో పాటు, విడుదల తేదీని ప్రింట్ చేయించారు. ఉదయం లేవగానే మొదలయ్యే పాలతోనే ప్రమోషన్ చేయడమనే ఆలోచనకు అందరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పాల ప్యాకెట్లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ప్రమోషన్స్‌లో ఇదొక ట్రెండ్ సెట్టర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రామబాణం సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్‌ హయతి నటించగా.. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి గోపిచంద్‌ కెరీర్‌లో కీలకంగా మారిన ఈ సినిమా మ్యాచో హీరోకి ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..