The Warrior: యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించడం విశేషం. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రోమ్‌కు జోడిగా కృతిశెట్టి నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ శనివారం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. ఇక సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈస్మార్ట్ శంకర్, రెడ్ వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూకుడు మీదున్న రామ్ ఖాతాలో మరో విజయాన్ని వేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారియర్ మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా ఉన్నత స్థాయిలో ఉందని అందరూ చెబుతున్నారు.
సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పాటను తెరకెక్కించాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..