ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్ చిరంజీవిల మధ్య జరిగిన వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు అభిమానుల కోరిక మేరకు ఫొటోలకు పోజులివ్వడం, దాన్ని చూసి గరికపాటి ఫొటోలు ఆపేస్తే ప్రసంగాన్ని కొనసాగిస్తాననడం పెద్ద రచ్చకు దారి తీసింది. అయితే ఈ విషయంలో చిరు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్‌కు కూడా అగ్నికి ఆజ్యం పోసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వెంటనే రియలైజ్ అయిన నాగబాబు మరో ట్వీట్ చేసినా ఈ వివాదం సమసిపోలేదు.
అయితే ఇప్పుడిప్పుడే ఈ వివాదం కాస్త సద్దుమణుగుతోందని అనుకుంటున్న సమయంలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్స్ చేశాడు. టాపిక్ ఏదైనా, సమాజంలో జరిగే ప్రతీ అంశంపై స్పందించే వర్మ ఇప్పుడు గరికపాటి, చిరంజీవి ఇష్యూలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయంలో వర్మ చిరంజీవికి సపోర్ట్‌గా నిలిచాడు. గరికపాటిపై విమర్శలు కురిపించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ట్వీట్ చేశాడు.
మెగా బ్రదర్ నాగబాబు ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు వర్మ. అంతటితో ఆగకుండా చిరంజీవిని కూడా ట్యాగ్ చేశాడు. నువ్వేంటో తెలుసుకో అంటూ గరికపాటిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఈ టీట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. వర్మ ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి ??????
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ????
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..