RRR Movie: మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌ కాలికి మళ్లీ ఏమైంది..!

| Edited By:

Nov 13, 2020 | 3:49 PM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాలికి మళ్లీ గాయమైందా..! ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఫొటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

RRR Movie: మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌ కాలికి మళ్లీ ఏమైంది..!
Follow us on

Ram Charan leg: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాలికి మళ్లీ గాయమైందా..! ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఫొటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటొల్లో సంప్రదాయ దుస్తుల్లో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ అదరగొట్టేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి అభిమానులైతే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా ఈ ఫొటోలలో తన ఎడమకాలికి బ్యాండ్‌ వేసుకొని కనిపించారు రామ్ చరణ్‌. (డీఎస్పీ vs డీఎస్పీ: దూసుకుపోతున్న ఉప్పెన, రంగ్‌ దే పాటలు.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌)

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ మొదలైన రోజుల్లోనే రామ్ చరణ్‌ ఎడమ కాలికి గాయం అయ్యింది. దీంతో అప్పట్లో షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి కూడా చిన్న ఇంజ్యూరీ అవ్వడంతో.. సినిమా షూటింగ్‌ని కొన్ని రోజులు ఆపేశారు.ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఎడమ కాలికి బ్యాండ్ ఉండటంతో ఆ గాయం తాలుకు పెయిన్ ఇంకా ఈ హీరోకు ఉందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (ఫ్యాన్స్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ టీమ్‌ స్పెషల్‌ దీపావళి గిఫ్ట్‌.. సంప్రదాయ దుస్తుల్లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌, చెర్రీ)