
హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్ లోగా పూర్తి చేసి.. తన కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడట రామ్ చరణ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ చేయబోయే కొత్త చిత్రం గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన కొత్త చిత్రం కోసం దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి పని చేయనున్నాడట. ఈ ప్రకారం ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు వినికిడి. కాగా ప్రస్తుతం వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
మరోవైపు రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కలయికలో వచ్చిన మెుదటి సినిమా ‘ఎవడు’.. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వస్తున్న వార్తలు బట్టి వారిద్దరి కలయికలో రాబోయే రెండో సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందట.ఈ సినిమాపై అధికారక ప్రకటన కొద్దిరోజులలో ప్రకటించనుంది చిత్ర యూనిట్.