RRR Movie: కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్న రామ్- భీమ్.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..

|

Mar 27, 2022 | 9:41 AM

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. థియేటర్స్ అన్నింటిలో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి చేస్తుంది.

RRR Movie: కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్న రామ్- భీమ్.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..
Rrr
Follow us on

RRR Movie : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. థియేటర్స్ అన్నింటిలో ఆర్ఆర్ఆర్(RRR) సినిమా సందడి చేస్తుంది. దాదుపు నాలుగేళ్లుగా సినిమా కోసం ఎదురుచూసిన అభిమానులకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందించారు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్(NTR), మెగాపవర్ స్టార్(Ram Charan) ఇద్దరు తన నట విశ్వరూపం తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు అంటున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్. కొమురం భీమ్ గా తారక్ , అల్లూరిసీతారామ రాజుగా మెగాపవర్ స్టార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్. ఇక ఈ సినిమా మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఊపేస్తోంది. అక్కడ ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ దక్కాయి.ప్రీమియర్స్​లో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్​ చేసిన RRR.. ఫస్ట్ డే కలెక్షన్ విషయంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. అమెరికాలోనే ప్రీమియర్స్​తో పాటు తొలి రోజు కలెక్షన్లు 5 మిలియన్ల మార్కును దాటేశాయి. ఇక ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కలిపి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

మొదటి రోజు మొత్తంగా  దాదాపు 124.7 కోట్లను వసూల్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు మాత్రం దేశవ్యాప్తంగా దాదాపు 100 కోట్లు వసూల్ చేసి దూసుకుపోతుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఈ సినిమా రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా రూ. 9.90 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను నమోదు చేసుకుంది. ఇక హిందీలో 23 నుండి 26 కోట్ల వరకు వసూల్ చేసిందని సమాచారం. ఏపీ తెలంగాణ కలిపి 40-45 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని అంటున్నారు. మొత్తంగా భారీ వసూల్ దిశగా ఆర్ఆర్ఆర్ సినిమా దూసుకుపోతోంది. ఇక ఆల్ ఇండియా  80నుంచి 100 కోట్లు వరకు అలాగే ఓవర్సీస్ లో  27 నుంచి30 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 121 నుంచి 151 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..