దర్శకుడిని ఫిక్స్ చేసుకున్న చెర్రీ.. దసరాకు ప్రకటన

మిగిలిన హీరోలందరూ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తుంటే మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు.

దర్శకుడిని ఫిక్స్ చేసుకున్న చెర్రీ.. దసరాకు ప్రకటన

Edited By:

Updated on: Sep 04, 2020 | 3:44 PM

Ram Charan Next: మిగిలిన హీరోలందరూ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తుంటే మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత రామ్ చరణ్ ఏ మూవీలో నటించబోతున్నాడని తెలుసుకునేందుకు(చెర్రీ ఆచార్యలో అతిథి పాత్ర మాత్రమే) మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొరటాల శివ, వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి ఇలా పలువురి పేర్లు కూడా వినిపించాయి. అయితే దేనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న తాజా సమాచారం ప్రకారం చెర్రీ, దర్శకుడిని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే.. వెంకీ కుడుముల. ఛలో మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల, భీష్మతో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇటీవల ఈ దర్శకుడు చెర్రీకి ఓ కథను చెప్పడం, ఆయనకు నచ్చడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకీ కుడుముల ప్రస్తుతం స్క్రిప్ట్‌ని తయారు చేసే పనిలో పడ్డారని, దసరాకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

సోదరులు చనిపోయారని ఇంకా దిలీప్‌ కుమార్‌కి తెలీదట

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు