Ram Charan RRR: కరోనాతో దాదాపుగా ఏడు నెలలు ఇంటిపట్టునే ఉన్న సినిమా నటీనటులు ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లారు. అయితే మరోవైపు అంతర్జాతీయంగా కరోనా లాక్‌డౌన్‌కి సడలింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్‌లకు వెళ్లేందుకు స్టార్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ బాబు, ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా ఉపాసనతో ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. (విషమంగానే అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయి ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తోన్న వైద్యులు)
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే ప్లాన్‌లో ఉన్నారట. ఈ నెలాఖరున చెర్రీ, ఉపాసనతో కలిసి దుబాయ్‌కి వెళ్లాలనుకుంటున్నారట. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ని త్వరగా పూర్తి చేసి.. చిరంజీవి ఆచార్యలో పాల్గొనే ఆలోచనలో కూడా చెర్రీ ఉన్నట్లు తెలుస్తోంది. (క్రేజీ ఆఫర్‌ని వదులుకున్న ‘ఉప్పెన’ దర్శకుడు.. 70లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామన్నా..!)