heroine Rakulpreet singh: ‘నీ పని అయిపోయింది.. ఇక నీకు అవకాశాలు రావన్నారు’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన రకుల్..

సాధరణంగా తాము నటించే సినిమాల కోసం హీరోహీరోయిన్లు ఎలా మారడానికైనా సిద్ధపడిపోతుంటారు. కొందరు స్లిమ్‏గా, మరికొందరు బొద్దుగా మారుతుంటారు. అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్

heroine Rakulpreet singh: నీ పని అయిపోయింది.. ఇక నీకు అవకాశాలు రావన్నారు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన రకుల్..

Edited By: Sanjay Kasula

Updated on: Jan 18, 2021 | 10:21 PM

సాధరణంగా తాము నటించే సినిమాల కోసం హీరోహీరోయిన్లు ఎలా మారడానికైనా సిద్ధపడిపోతుంటారు. కొందరు స్లిమ్‏గా, మరికొందరు బొద్దుగా మారుతుంటారు. అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాను నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘దేదే ప్యార్ దే’ సినిమా కోసం దాదాపు 8 కేజీలు తగ్గింది. దీంతో ఆమె లుక్ చూసిన వారు.. బాగా ట్రోల్స్ చేసినట్లుగా రకుల్ తాజాగా వెల్లడించింది.

“దేదే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగణ్, టబు లాంటి అనుభవజ్ఞులతో కలిసి నటించే అవకాశం లభించింది. దీంతో ఈ మూవీలో ఎలాగైన నటించాలని అనుకున్నా.. అందుకు రోజూ జిమ్‏లో 4 గంటలు కష్టపడ్డా.. అలా 40 రోజుల్లోనే 8 కిలోలు తగ్గాను. ఆ సమయంలో నా లుక్స్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది నా ఫోటోలు షేర్ చేస్తూ.. ఏంటి ఇంత సన్నగా అయిపోయావ్ ? ఇక నీ సినిమాలెవరు చూడరు. నీ పని అయిపోయింది. తెలుగులో నీకు అవకాశాలు రావు అని కామెంట్స్ చేశారు. నేను కళ్ళు మూసుకొని మనసుకి ఒకటే చెప్పుకున్నా.. ఏదీ పట్టించుకోకు.. నీ పనే నీ విమర్శలకు సమాధానం చెబుతుంది అని నన్ను నేను సముదాయించుకున్నా.. అనుకున్నట్లుగానే నాకు ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది” అంటూ చెప్పుకొచ్చింది రకుల్. ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ నటిస్తున్న ‘చెక్’ మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‏లో ‘మేడే’ సినిమాలో నటిస్తుంది.

Also Read:

Actor Prakash Raj: ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ‏షూటింగ్‎లో ప్రకాష్ రాజ్.. ట్వీట్ చేసిన నటుడు.. 

Actress Kriti Sanon : మహేష్ హీరోయిన్ కవితకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌‌‌‌గా మారిన కృతిసనన్ పోస్ట్