సినిమాలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ దూకుడును పెంచారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో కథకు ఓకే చెప్తూ తన స్పీడుతో యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు మురగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘దర్బార్’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు శివతో 168వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో రజనీకి జోడీగా మీనా ఫిక్స్ అయినట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరిగాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా రజనీ సినిమాలైన ‘అన్బుల్ల రజనీకాంత్’, ‘ఎంగెయో కెట్ట కురుల్’ చిత్రాల్లో నటించిన మీనా.. ఆయన సరసన ‘వీర’, ‘యజమాన్’, ‘ముత్తు’ చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు 24 ఏళ్ల తరువాత ఈ హిట్ జోడీ మళ్లీ రిపీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే విషయంపై ఇటీవల మీనాను ప్రశ్నించగా.. ఆమె ఈ వార్తలను ఖండించలేదు. దీనిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదేమోనంటూ సమాధానం ఇచ్చింది. దీంతో రజనీ 168వ చిత్రంలో మీనా కన్ఫర్మ్ అయినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో కీర్తి సురేష్, ఖుష్బూ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీలో కమెడియన్ పాత్రకు సూరీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ మూవీతో మొదటిసారిగా రజనీకాంత్‌కు డి.ఇమ్మన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అయితే క్రేజీ కాంబోగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.