ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్.. సూపర్ స్టార్ రజినీ కాంత్ తరువాతి సినిమా డైరెక్టర్ అతడేనా ?
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'అన్నాత్తె' సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ మూవీకి బ్రేక్ పడింది.
Actor RajiniKanth : సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తె’ సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ మూవీకి బ్రేక్ పడింది. తిరిగి గతేడాది డిసెంబర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే యూనిట్ సభ్యులలో నలుగురికి కరోనా రావడం, రజినీ అస్వస్తతకు గురికావడంతో మళ్లీ ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. తాజాగా రజినీ చేయబోయే తదుపరి సినిమా గురించి మరో అప్డేట్ కోలివుడ్లో వినిపిస్తోంది.
రజనీ కాంత్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కార్తీక్ దర్శకత్వంలో రజినీ ఇంతకు ముందు పేట సినిమా చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే అన్నాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం. వీలైనంత తొందరగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఈ ఏడాది చివరిలో థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత రజినీ, కార్తీక్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పూర్తైన తర్వాత రజనీతో సినిమా చేయనున్నాడు కార్తీక్.
Also Read: సూపర్ స్టార్ సరసన సాహో బ్యూటీ.? మహేష్- రాజమౌళి సినిమాపై వైరల్ వార్త.!