బ్రేకింగ్: రాజశేఖర్ సంచలన నిర్ణయం.. ‘మా’ పదవికి రాజీనామా

| Edited By:

Jan 02, 2020 | 6:16 PM

‘మా’ డైరీ ఆవిష్కరణలో జరిగిన రచ్చ నేపథ్యంలో సినీ నటుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన లేఖను ‘మా’కు పంపారు. అందులో అధ్యక్షుడు నరేష్ వైఖరి మనస్తాపం కలిగించిందని రాజశేఖర్ వెల్లడించారు. ఇంకా ఆ లేఖలో ఆయన ఏం రాశారంటే.. ‘‘మా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పటి నుంచి అధ్యక్షుడు నరేష్‌తో కలిసి అసోషియేషన్‌ను అభివృద్ధి చేయాలని భావించాను. కానీ నరేష్ చేసిన […]

బ్రేకింగ్: రాజశేఖర్ సంచలన నిర్ణయం.. మా పదవికి రాజీనామా
Follow us on

‘మా’ డైరీ ఆవిష్కరణలో జరిగిన రచ్చ నేపథ్యంలో సినీ నటుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన లేఖను ‘మా’కు పంపారు. అందులో అధ్యక్షుడు నరేష్ వైఖరి మనస్తాపం కలిగించిందని రాజశేఖర్ వెల్లడించారు.

ఇంకా ఆ లేఖలో ఆయన ఏం రాశారంటే.. ‘‘మా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పటి నుంచి అధ్యక్షుడు నరేష్‌తో కలిసి అసోషియేషన్‌ను అభివృద్ధి చేయాలని భావించాను. కానీ నరేష్ చేసిన తప్పులే చేస్తూ.. అసోషియేషన్‌లో పారదర్శకత లేకుండా చేశారు. మా కమిటీ మెంబర్లకు ఆయన ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. ఏ విషయంలోనైనా మెజారిటీ వారి అభిప్రాయాలను తీసుకోకుండా.. తన సొంతంగానే నరేష్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇవాళ డైరీ ఆవిష్కరణకు సంబంధించి వేడుక గురించి సమావేశం పెట్టి చెప్పలేదు కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే తన సందేశాన్ని పంపారు. మేము కమిటీలో చేరినప్పటి నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. మా అధ్యక్షుడి ప్రవర్తనపై ఇదివరకు ఇండస్ట్రీలోని పెద్దలతోనూ చర్చించాం. అలాగే మా సమావేశంలోనూ చర్చించుకున్నాం. అయితే తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు ఏం జరగదని అర్థమైంది. అందుకే ఈ రోజు జరిగిన సమావేశంలో నేను ఎమోషనల్ అయ్యాను. ఈ సందర్భంగా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. నేను చాలా ముక్కుసూటి మనిషిని. చాలా సున్నితమైన వ్యక్తిని. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇలానే ఉంటా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పదవిని రాజీనామా చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.

అయితే గురువారం జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ రచ్చ రచ్చ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఆయన మాట్లాడే సమయంలో పలుమార్లు అడ్డుపడ్డారు రాజశేఖర్. దీంతో చిరు కాస్త అసహనానికి గురయ్యారు. ఆ తరువాత కూడా రాజశేఖర్ తన చేష్టలతో అక్కడున్న వారిని కాస్త ఇబ్బందికి గురి చేశారు. ఈ క్రమంలో ఆయన తీరును కొందరు ఖండించారు. ఈ క్రమంలో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు.