అవేవీ పట్టించుకోని రాజమౌళి.. పెద్ద సాహసమే చేస్తున్నాడా..!

కరోనాతో బ్రేక్ పడిన ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ని రాజమౌళి తిరిగి ఇవాళ ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ 70 శాతం పూర్తి అవ్వగా.

అవేవీ పట్టించుకోని రాజమౌళి.. పెద్ద సాహసమే చేస్తున్నాడా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 06, 2020 | 12:56 PM

Rajamouli RRR movie: కరోనాతో బ్రేక్ పడిన ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ని రాజమౌళి తిరిగి ఇవాళ ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ 70 శాతం పూర్తి అవ్వగా.. మిగిలిన 30 శాతంను త్వరగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న పక్కా ప్రణాళికను వేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇందులో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్‌ సరసన సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్రకు అలియా ఒక్కటే న్యాయం చేయగలదని, అందుకే ఆమెను తీసుకున్నట్లు రాజమౌళి ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అలియాను అనౌన్స్ చేసినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు.

సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌పై నెగిటివిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపోటిజం వలన సుశాంత్‌ మరణించాడని చాలా ఆరోపణలే వచ్చాయి. ఈ వివాదంలో అలియా పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో ఆ మధ్యన అలియా నటించిన సడక్‌ 2 ఓటీటీలో విడుదల కాగా.. దానిపై నెగిటివ్ ప్రచారం జరిగింది. ఆ మూవీ ట్రైలర్ మోస్ట్‌ డిస్‌లైక్డ్‌ వీడియోగా రికార్డు సాధించింది. అలాగే ఈ సినిమాకు కూడా చాలామంది తక్కువ రేటింగ్ ఇచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో అలియా విషయంలో రాజమౌళి డైలమాలో ఉన్నారని, ఆమెనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, అలియా స్థానంలో ప్రియాంక చోప్రా రానుందని పలు గాసిప్‌లు వినిపించాయి. అయితే వాటన్నింటిని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ కొట్టిపారేసింది. ఇవాళ చేసిన ట్వీట్లలో అలియా పేరును ప్రస్తావించారు. దీంతో అన్ని అనుమానాలను తీర్చేశారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటికి పరిస్థితులు మారే అవకాశం ఉంది. అందునా రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అలియాపై ఉన్న నెగిటివ్‌ ఈ సినిమాకు నెగిటివ్‌ అవ్వదని కొంతమంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటి పరిస్థితులను చూస్తే మాత్రం రాజమౌళి పెద్ద సాహసం చేస్తున్నాడనే చెప్పొచ్చు.

Read More:

క్రేజీ మల్టీస్టారర్‌లో జగపతిబాబు..!

ఆ అవార్డుతో నయన్‌ పెళ్లి లింక్‌.. గెలుచుకున్న తరువాతే వివాహం..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu