‘వకీల్‌ సాబ్’‌ కోసం 20 రోజులు ఇచ్చిన పవన్‌..!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం వకీల్ సాబ్‌. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది

'వకీల్‌ సాబ్'‌ కోసం 20 రోజులు ఇచ్చిన పవన్‌..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 06, 2020 | 2:25 PM

Pawan Kalyan Vakeel Saab: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం వకీల్ సాబ్‌. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. ఇటీవల మళ్లీ ప్రారంభించారు. అయితే ఈ షూటింగ్‌లో పవన్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 26 నుంచి పవన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ 20 రోజులను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ లోపు ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన డేట్లకు అనుగుణంగా ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్‌ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఇక ఈ మూవీలో పవన్ సరసన శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

అవేవీ పట్టించుకోని రాజమౌళి.. పెద్ద సాహసమే చేస్తున్నాడా..!

క్రేజీ మల్టీస్టారర్‌లో జగపతిబాబు..!