ప్రభుత్వ చీఫ్ విప్‌తో రాహుల్‌, ప్రకాష్‌ రాజ్ భేటీ.. రాజీ కోసమేనా..!

| Edited By:

Mar 09, 2020 | 6:20 PM

'బిగ్‌బాస్ 3' విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఇటీవల ఓ పబ్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతిచ్చారు.

ప్రభుత్వ చీఫ్ విప్‌తో రాహుల్‌, ప్రకాష్‌ రాజ్ భేటీ.. రాజీ కోసమేనా..!
Follow us on

‘బిగ్‌బాస్ 3’ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఇటీవల ఓ పబ్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతిచ్చారు. రాహుల్‌కు అన్యాయం జరిగిందని.. పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి రాహుల్‌తో కలిసి వెళ్లిన ప్రకాష్ రాజ్.. అక్కడ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను కలిశారు.

అనంతరం మాట్లాడుతూ.. వినయ్ భాస్కర్‌ను మర్యాద పూర్వకంగానే కలిశామని అన్నారు. కేసు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్‌ను కలవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని.. దాడిలో రాహుల్ తప్పేమీ లేదని ఆయన అన్నారు. తప్పు చేయనప్పుడు రాహుల్ కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలని ఆయన ప్రశ్నించారు. పబ్‌లోకి వెళ్లడం తప్పు కాదని, వెళ్లినంత మాత్రాన బాటిల్‌ తీసుకుని కొట్టి చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తాను పోలీసు కమిషనర్‌తో కూడా మాట్లాడతానని ప్రకాశ్‌రాజ్‌ హామీ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలే తప్ప దాడి చేయడం మంచిది కాదన్నారు. ఒకరిని పట్టుకుని పది మంది కలిసి కొట్టడం తప్పేనంటున్నారు.

అయితే హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో ఇటీవల జరిగిన దాడిలో సింగర్‌ రాహుల్‌కి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు సింగర్ ఫిర్యాదు చేశారు. రాహుల్‌పై దాడి చేసిన నిందితులు ఘటన జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నారు. ఆ తర్వాత తనకు న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు రాహుల్‌. అయితే దాడి చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సోదరుడు కావడంతో ఈ గొడవకు రాజకీయరంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం విషయంలో రాజీ కుదుర్చేందుకు ప్రకాశ్‌ రాజ్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్‌, రాహుల్‌ను వెంటబెట్టుకొని అసెంబ్లీకి వెళ్లినట్లు సమాచారం. కాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగ మార్తాండ’ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌తో కలిసి నటిస్తున్నారు రాహుల్.

Read This Story Also: తండ్రి చావును కోరుకుంది.. డబ్బు కోసమే డ్రామాలు: అమృతకు శ్రవణ్ కౌంటర్