‘కాంచన 3’ రివ్యూ

| Edited By:

Apr 19, 2019 | 4:50 PM

చిత్రం: కాంచన 3 దర్శకత్వం: రాఘవ లారెన్స్ నిర్మాత: రాఘవ లారెన్స్(రాఘవేంద్ర ప్రొడక్షన్స్), కళానిధి మారన్(సన్ పిక్చర్స్), ఠాగూర్ మధు(తెలుగులో విడుదల) నటీనటులు: రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, సూరి, దేవదర్శిని, కబీర్ దుహన్ సింగ్ తదితరులు సంగీతం: రాజ్, కపిల్, జెస్సీ, భరత్ మధుసూధన్, శ్రీ భరత్, సరవేది శరణ్, థమన్(బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్) సినిమాటోగ్రఫీ: వేట్రి, సుశీల్ చౌదరి హాలీవుడ్, బాలీవుడ్‌లో సైతం హిట్ సినిమా సీక్వెల్‌లు ఫ్లాప్‌‌లుగా అవుతుండగా.. ‘ముని’ సిరీస్‌లో […]

‘కాంచన 3’ రివ్యూ
Follow us on

చిత్రం: కాంచన 3
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: రాఘవ లారెన్స్(రాఘవేంద్ర ప్రొడక్షన్స్), కళానిధి మారన్(సన్ పిక్చర్స్), ఠాగూర్ మధు(తెలుగులో విడుదల)
నటీనటులు: రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, సూరి, దేవదర్శిని, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
సంగీతం: రాజ్, కపిల్, జెస్సీ, భరత్ మధుసూధన్, శ్రీ భరత్, సరవేది శరణ్, థమన్(బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్)
సినిమాటోగ్రఫీ: వేట్రి, సుశీల్ చౌదరి

హాలీవుడ్, బాలీవుడ్‌లో సైతం హిట్ సినిమా సీక్వెల్‌లు ఫ్లాప్‌‌లుగా అవుతుండగా.. ‘ముని’ సిరీస్‌లో మూడు విజయాలు సొంతం చేసుకున్నాడు  కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్. ఈ మూడు చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. నిజానికి చెప్పాలంటే టాలీవుడ్‌లో హారర్ కామెడీ చిత్రాలకు ఊపు తెచ్చింది ‘ముని’ సిరీస్ అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇప్పుడు అదే సిరీస్‌లో నాలుగో చిత్రం ‘కాంచన 3’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ:
తల్లి ప్రభావంతో తన జీవితాన్ని ఎదుటివారి కోసమే త్యాగం చేస్తూ.. అంగ వైకల్యం కలిగిన పిల్లల కోసం ఓ ఆశ్రమాన్ని నడుపుతుంటాడు కాళీ(రాఘవ లారెన్స్). మరోవైపు మినిస్టర్ శంకర్, ఆయన తమ్ముడు.. కాళీ ద్వారా ఎనభై కోట్ల డబ్బును సంపాదించాలని ప్లాన్ చేస్తారు. దానికి కాళీ అంగీకరించడు. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కాళీ హత్యకు గురవుతాడు. చనిపోయిన కాళీ దెయ్యంగా రాఘవ(రాఘవ లారెన్స్)లోకి ఆవహిస్తాడు. అనంతరం కాళీ తన పగను ఎలా తీర్చుకున్నాడు..? చివరకు రాఘవను కాళీ వదిలేశాడా..? లేదా..? అనే విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
రాఘవ లారెన్స్ నటన
వేదిక, ఓవియా అభినయం
ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్

మైనస్ పాయింట్స్:
సీక్వెన్స్‌లో మిస్ అయిన ఫ్లో
సినిమా లెంగ్త్
ఎక్కువైన తమిళ నేటివిటీ

విశ్లేషణ:
కాంచన 2 గురించి చెప్పుకోవాలంటే ముందు దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వ పనితీరు గురించి చెప్పాల్సిందే. హారర్ కామెడీలో ప్రేక్షకుల నాడిని ఒడిసి పట్టుకున్న లారెన్స్ ‘కాంచన 3’ని తెరకెక్కించడంలో మంచి విజయాన్ని సాధించాడు. అయితే కథనం, నెరేషన్‌లో ఇంతకుముందు వచ్చిన కాంచన 1, 2 పార్ట్స్‌లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్‌నే ‘కాంచన 3’లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకుముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్ సినిమాకు అస్సెట్‌గా నిలిచాయి. అలాగే థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. నిర్మాణ విలువలు బావుతున్నాయి.

ఫైనల్ వర్డిక్ట్:
హారర్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం క్లాస్ ఆడియెన్స్‌ను పక్కనపెడితే బీ, సీ సెంటర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కామెడీ, రొటీన్ హారర్, ఓవర్ యాక్షన్‌తో అక్కడక్కడా కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఓవరాల్‌గా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.