పిల్లి చెప్పింది.. డేట్‌కు వెళ్లా.. పెళ్లి చేసుకున్నా

పిల్లి చెప్పింది.. డేట్‌కు వెళ్లా.. పెళ్లి చేసుకున్నా.. ఏంటి చదువుతుంటే కాస్త వింతగా ఉంది కదూ..! కానీ దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే.. తన పెళ్లి గురించి ఇటీవల ఆసక్తికర విషయం బయటపెట్టింది. పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ అమ్మడికి ఒకేసారి డేటింగ్ ప్రపోజల్ వచ్చిందట. అందులో ఒకడు తనకంటే పెద్దవాడు కాగా.. మరొకడు తనకంటే చిన్నోడట. వీరిలో ఎవరితో […]

పిల్లి చెప్పింది.. డేట్‌కు వెళ్లా.. పెళ్లి చేసుకున్నా

Edited By:

Updated on: Dec 28, 2019 | 2:19 PM

పిల్లి చెప్పింది.. డేట్‌కు వెళ్లా.. పెళ్లి చేసుకున్నా.. ఏంటి చదువుతుంటే కాస్త వింతగా ఉంది కదూ..! కానీ దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే.. తన పెళ్లి గురించి ఇటీవల ఆసక్తికర విషయం బయటపెట్టింది. పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ అమ్మడికి ఒకేసారి డేటింగ్ ప్రపోజల్ వచ్చిందట. అందులో ఒకడు తనకంటే పెద్దవాడు కాగా.. మరొకడు తనకంటే చిన్నోడట. వీరిలో ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలి అని తెగ ఆలోచించిందట. ఈ క్రమంలో రూమ్మేట్‌తో కలిసి ఓ నిర్ణయం తీసుకుందట. తను పెంచుకున్న పిల్లికి తాను వండిన ట్యూనా చేపను పెట్టిందట. అది తింటే తనకంటే పెద్దవాడితో.. తినకపోతే చిన్నవాడితో డేటింగ్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యిందట.

ఇక అప్పటికే ఆకలి మీద ఉందో ఏమో..? లేక రాధికా ఫ్యూచర్‌ను నిర్ణయించే బాధ్యత తీసుకుందో తెలీదు కానీ ఆ ట్యూనా చేపను పిల్లిని తినేయడంతో వెంటనే పెద్దవాడితో డేటింగ్‌కు వెళ్లిందట. ఇక ఆ పెద్దవాడు ఎవరంటే రాధికా ఆప్టే భర్త బెనెడిక్ట్. అతడితో డేటింగ్‌కు వెళ్లిన ఆమె.. ఆ తరువాత ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కాగా బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్లలో రాధికా ఆప్డే ఒకరు. వివాహం తరువాత కూడా ఆమె పలు న్యూడ్ సీన్లలో నటించింది. దీనికి ఆమె భర్త బెనెడిక్ట్ అభ్యంతరం చెప్పకపోవడం గమనర్హం. ఏదేమైనా రాధికా జీవిత భాగస్వామిని పిల్లి డిసైడ్ చేయడం ఏంటో అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్న రాధికా.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ దూసుకుపోతోంది.