Pushpa Sami Song: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయయాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట ఈ పాట అనే తేడా లేకుండా అన్ని సాంగ్స్ హంగామా సృష్టించాయి.
ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ వరుస పెట్టి వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసిన కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను మౌనిక యాదవ్ ఫోక్ సింగర్ అద్భుతంగా ఆలపించారు.
ఇక థియేటర్లలో సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా సౌత్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ. 22 కోట్లకు కోనుగోలు చేసింది. ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా పుష్ప చిత్రాన్ని ఈరోజు (శుక్రవారం) రాత్రి 8 గంటల నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యం స్ట్రీమింగ్ కానుంది. ఇక పుష్ప థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఇదిలా ఉంటే పుష్ప చిత్రానికి పార్ట్2 గా తెరకెక్కనున్న ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభించి. ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారని సమాచారం.
He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb! ?
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs— amazon prime video IN (@PrimeVideoIN) January 5, 2022
Also Read: Temple Renovation: టెక్నాలజీ సాయంతో ఆలయంలో కీలక మార్పులు.. మండపం, విగ్రహాన్ని..
Maharashtra Corona: దేశంలో పంజా విసురుతున్న కరోనా.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర..!