Puri Jagannadh : ‘ఫైటర్’ సినిమా తర్వాత ఆ స్టార్ హీరోతో పూరీజన్నాథ్ సినిమా చేస్తున్నాడా..?

|

Jan 05, 2021 | 8:52 AM

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజన్నాథ్ సినిమా అంటే అభిమానుల్లో మాములు క్రేజ్ ఉండదు. హీరోలను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేయడం పూరీ స్టైల్.

Puri Jagannadh : ఫైటర్ సినిమా తర్వాత ఆ స్టార్ హీరోతో పూరీజన్నాథ్ సినిమా చేస్తున్నాడా..?
Follow us on

Puri Jagannadh  : టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజన్నాథ్ సినిమా అంటే అభిమానుల్లో మాములు క్రేజ్ ఉండదు. హీరోలను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేయడం పూరీ స్టైల్. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్న పూరీ. ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి’ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా ఎంటర్ అయ్యింది. దాంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ.

ఈ మూవీ తర్వాత ఈ డేరింగ్ డైరెక్టర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని పూరీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. మహేష్ కోసం ‘జనగణమన’ అనే టైటిల్ తో స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నాడు.  కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఇదే స్టోరీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వినిపించాడని ఇటీవల ఫిలింనగర్లో టాక్ కూడా నడిచింది. తాజాగా మరో ఇంటరెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న హీరో యష్ తో పూరీ జగన్నాథ్ సినిమా ఉండనుందని. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో పూరీ, యష్ సినిమా రాబోతుందని ఓ వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు యష్. ఇటీవల మాఫియా నేపథ్యంలో పూరీ అద్భుతమైన స్క్రిప్ట్ను తయారు చేశాడని సమాచారం. దీన్ని హీరో యష్ కు వినిపించాడని కూడా తెలుస్తోంది. ఈ స్టోరీ నచ్చడంతో  వెంటనే యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించాలని భావిస్తున్న ఈ మూవీని.. అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని సూచిస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

also read : Nandamuri Kalyan Ram : సరికొత్త లుక్‌‌‌‌‌‌లో అదరగొడుతున్న నందమూరి హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..