‘తిమ్మరుసు’ టీజర్‌ రిలీజ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్.. అదిరిపోయే లుక్‌లో కనిపించిన సత్యదేవ్..

|

Dec 09, 2020 | 8:09 PM

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ తాజాగా మరో కొత్త గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు

తిమ్మరుసు టీజర్‌ రిలీజ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్.. అదిరిపోయే లుక్‌లో కనిపించిన సత్యదేవ్..
Follow us on

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ తాజాగా మరో కొత్త గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తిమ్మరుసు సినిమా ద్వారా లాయర్‌గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ఈ సినిమా టీజర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ విడుదల చేసి సినిమా మంచి సక్సెస్‌ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. “కేసు గెలిచామా? ఓడామా? అనేది కాదు ఇంపార్టెంట్‌. సంపాదన ఎంతనేదే ఇంపార్టెంట్‌…అని ఓ వ్యక్తి హీరో సత్యదేవ్‌ను ఉద్దేశించి అడిగితే తను మాత్రం “నాకు మాత్రం న్యాయం గెలవడం మాత్రమే ఇంపార్టెంట్‌ సార్‌” అని అంటాడు. అంటే హీరో న్యాయం గెలవడానికి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి అని అర్థమవుతుంది. ఇంతకీ సత్యదేవ్‌ న్యాయాన్ని గెలిపించడానికి ఏం చేశాడు? అనేది తెలుసుకోవాలంటే ‘తిమ్మరుసు’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శక నిర్మాతలు. విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఆసక్తికరమైన టీజర్‌ ద్వారా తెలియజేశాం. సత్యదేవ్‌ లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమా దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.