రూల్స్ బ్రేక్ చేసినందుకు టాలీవుడ్ హీరో నాగశౌర్యకు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో బ్లాక్ ఫిల్మ్ కారులో ఆయన ప్రయాణిస్తుండగా గమనించిన పోలీసులు.. ఆ వాహనాన్ని ఆపి రూ.500లు జరిమానా విధించారు. అనంతరం బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి నాగశౌర్య వాహనాన్ని అక్కడి నుంచి పంపేశారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రూల్స్‌పై కఠినంగా వ్యవహరించే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రూల్స్ అతిక్రమించినందుకు గానూ ఇదివరకు పలువురు ప్రముఖులకు ఫైన్లు విధించిన విషయం తెలిసిందే.