Director Rajkumar: టాలీవుడ్‌లో విషాదం.. చిరు మొదటి సినిమా దర్శకుడు మృతి..!

| Edited By:

Feb 15, 2020 | 11:24 AM

Director Rajkumar death: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ కుమార్ అంత్యక్రియలను అక్కడే నిర్వహించనున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లుకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు(అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్ర విడుదల […]

Director Rajkumar: టాలీవుడ్‌లో విషాదం.. చిరు మొదటి సినిమా దర్శకుడు మృతి..!
Follow us on

Director Rajkumar death: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ కుమార్ అంత్యక్రియలను అక్కడే నిర్వహించనున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లుకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు(అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్ర విడుదల అప్పట్లో ఆలస్యమైంది). ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇక ఆ సినిమాకు ఆయన ఐదు నంది అవార్డులను సొంతం చేసుకొని అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచారు. ఆ తరువాత మా శ్రీమల్లి అనే చిత్రాన్ని మాత్రమే తీసిన రాజ్ కుమార్.. అప్పటి నుంచే టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో స్పదించిన మెగాస్టార్.. రాజ్‌ కుమార్‌కు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు.

కాగా ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమారులు ఉండగా.. భార్య, పెద్ద కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నారు. సంపాదన కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీశారు