Andhadun Malayal remake: బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన అంధాధున్ ఎంతటి మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో నటనకు గానూ ఆయుష్మాన్‌కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. కాగా ఈ మూవీ ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ అవ్వబోతోంది. తెలుగులో ఈ మూవీ రీమేక్‌లో నితిన్ నటిస్తుండగా.. తమన్నా, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.
అలాగే తమిళంలో ప్రశాంత్, ఆయుష్మాన్ పాత్రలో కనిపించనుండగా.. టబు పాత్ర కోసం ఐశ్వర్య రాయ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక తాజాగా మలయాళంలో అంధాధున్ రీమేక్ అవ్వబోతోందట. అక్కడ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ అంధాధున్ రీమేక్‌లో నటించనున్నారట. ఇక టబు పాత్రలో మమతా మోహన్ దాస్ కనిపించనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా పృథ్వీ, మమతా మోహన్‌దాస్ ఇదివరకు అన్వర్, 9 చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.