Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని ఇటీవల ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే దిల్ రాజు కోసం పెళ్లి కుమార్తెను చూశారని.. త్వరలోనే ఆయన వివాహం కొంతమంది సన్నిహితుల సమక్షంలో జరగనుందన్న తెలుస్తోంది. అయితే భార్య మరణం తరువాత దాదాపు మూడు సంవత్సరాలుగా సినిమాలకే అంకితమైన ఈ నిర్మాత ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ఓ నటుడు కారణమని తెలుస్తోంది. ఆయనెవరంటే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.
దిల్ రాజుకు ప్రకాష్ రాజ్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటివరకు దిల్ రాజు 30 సినిమాలకు పైగా నిర్మించగా.. అందులో 15కు పైగా మూవీల్లో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఆ సాన్నిహిత్యం మూలంగానే దిల్ రాజును రెండో పెళ్లిని చేసుకోమని చెప్పారట. మధ్య వయస్సులో ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తరువాత మనల్ని చూసుకోవడానికి కచ్చితంగా ఒక తోడు అవసరం అని ప్రకాష్ రాజ్ సూచించారట. దీంతో కాస్త ఆలోచించిన ఈ నిర్మాత.. రెండో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే 2017లో దిల్ రాజు భార్య అనిత మరణించిన విషయం తెలిసిందే.