చిన్న సినిమాలకు మేలు చేకూరాలనే చర్చలు పెడుతున్నామని తెలిపారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్. Tv9 తో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సిద్దంగానే ఉన్నారని కానీ మల్టీప్లెక్స్ థియేటర్ వాళ్ళే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. చిన్న సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటే ఇప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చని ప్రకటించారు. వాటిని ఎవరూ ఆపడం లేదన్నారు. సినిమాలు రన్ అవుతున్నపుడు ఇలాంటి చర్చల వల్ల గ్యాప్ రావొద్దనే ఇప్పుడు చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. Ott ప్లాట్ ఫామ్స్ ఎప్పటికి థియేటర్‌కి సరితూగవని, అవి కూడా ఇంట్లో టీవీ లాంటివే అని పేర్కొన్నారు. సంక్రాంతి నుంచి ప్రేక్షకులు రెగ్యూలర్‌గా థియేటర్లో సినిమాలు చూడొచ్చని తెలిపారు.