Priyanka Chopra Throwback:స్వీట్ మెమోరీస్ అంటూ.. మిస్ వరల్డ్ 2000లో టైటిల్ గెలుచుకున్నప్పుడు ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా

|

Jan 29, 2021 | 4:44 PM

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక చోప్రా.. మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అందం అభినయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి హాలీవుడ్ లో అడుగు పెట్టి గ్లోబర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుందీ చిన్నది. కెరీర్ లో తాను చేసిన జర్నీ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో..

Priyanka Chopra Throwback:స్వీట్ మెమోరీస్ అంటూ.. మిస్ వరల్డ్ 2000లో టైటిల్ గెలుచుకున్నప్పుడు ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Follow us on

Priyanka Chopra Throwback: మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక చోప్రా.. మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అందం అభినయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి హాలీవుడ్ లో అడుగు పెట్టి గ్లోబర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుందీ చిన్నది. కెరీర్ లో తాను చేసిన జర్నీ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అన్‌ఫినిష్డ్‌ పేరుతో ఆటోబయోగ్రఫీ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో మైల్ స్టోన్స్ అనదగ్గ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా 2000 లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్నప్పటి ఫోటోను షేర్ చేసింది.
ప్రియాంక చోప్రా తన 18 ఏళ్ళ వయసులో మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన చిత్రాన్ని షేర్ చేసింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత బరేలీలోని తన ఇంటికి వెళ్లినప్పటి ఫోటో ఇది.. ఇందులో ప్రియాంక మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించి నీలిరంగు దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతూ తన అమ్మమ్మ తో పాటు తల్లిదండ్రులు మధు, అశోక్ చోప్రాలతో కలిసి ఉంది.

ఇక ప్రియాంక చోప్రా 2000 లో మిస్ వరల్డ్ కిరీటం పొందటానికి ముందు, ఆమె మిస్ ఇండియాను గెలుచుకుంది. 2000 లో ఆమె తోటి మిస్ ఇండియా విజేతలు లారా దత్తా , దియా మీర్జాలతో కలిసి ఉన్న మరో ఫోటోను షేర్ చేసింది. ఇక ప్రియాంక మిస్ వరల్డ్ గెలిచిన మూడు సంవత్సరాల తరువాత ది హీరో.. లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో బీ టౌన్ లో అడుగు పెట్టింది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ.. హాలీవుడ్ లో అడుగు పెట్టి.,. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తుంది.

మిస్ వరల్డ్ డైరీల నుండి అనేక చిత్రాలను అభిమానులకు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 2000 సంవత్సరం! ను తలుచుకుంటుంటే.. ఇంకా తాను కలలో ఉన్నట్లే ఉందని.. అప్పుడే 20 ఏళ్ళు గడిచిపోయాయని చెప్పింది. అమ్మాయిల ఇష్టాయిష్టాలను గుర్తించి వారి అర్హతకు తగిన అవకాశాలు కల్పిస్తే.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే శక్తి ఉందని తాను నమ్ముతానని చెప్పింది ప్రియాంక చోప్రా

Also Read: తన 53వ ఏట బాడీగార్డ్ ను ఆరో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటి పమేలా