మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘నవరస’ వెబ్‌‌‌‌‌‌సిరీస్‌‌‌‌లో సూర్య అలా కనిపించనున్నాడట.. హీరోయిన్‌‌‌‌గా ఆ మలయాళీ ముద్దుగుమ్మ

ఇటీవల విడుదలైన ఆకాశం నీహద్దురా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో సూర్య. ఇప్పుడు సూర్య డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస వెబ్‌‌‌‌‌‌సిరీస్‌‌‌‌లో సూర్య అలా కనిపించనున్నాడట.. హీరోయిన్‌‌‌‌గా ఆ మలయాళీ ముద్దుగుమ్మ

Updated on: Dec 20, 2020 | 6:45 PM

ఇటీవల విడుదలైన ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో సూర్య. ఇప్పుడు సూర్య డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. మణిరత్నం నిర్మిస్తున్న ‘సవరస’ అనే వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్య నటిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులతో తొమ్మిది మంది హీరోలతో ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌‌‌‌‌లో ఒక్కొక్క రసాన్ని చూపించనున్నారు. దర్శకుడు జయేంద్రతో కలసి మణిరత్నం ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌‌‌‌లో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క దర్శకుడు తెరకెక్కిస్తుండగా గౌతమ్ మీనన్ కూడా ఓ ఎపిసోడ్‌‌‌‌ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ఎపిసోడ్‌‌‌లో సూర్య హీరోగా నటిస్తున్నారు. సూర్య సరసన మలయాళీ ముద్దగుమ్మ ప్రయాగ మార్టిన్‌ నటిస్తుంది. ఇందులో సూర్య సంగీత దర్శకుడిగా కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు ఏ. ఆర్‌ రెహమాన్‌, గోవింద్‌ వసంతన్‌, జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌‌‌‌‌లో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.