Chiranjeevi: “ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది”.. చిరు కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి గుడ్ బై చెప్పి చాలాకాలం అయింది. అయితే తనకు నచ్చిన పొలిటిషియన్స్‌కు ఆయన వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. తాజాగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రజా రాజ్యం ఇప్పుడు మారిపోయి జనసేనగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ కామెంట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నోట జై జనసేన మాట వినిపించింది. నాటి ప్రజారాజ్యం నేటి జనసేనగా మారిందన్నారు చిరు. ఇందుకు తాను సంతోషంగా ఉన్నానని ప్రకటించారు. హైదరాబాద్‌లో లైలా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యాన్ని స్టేజ్‌పై వివరించారు చిరంజీవి. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజుతో తనకు పరిచయం ఉందన్న చిరంజీవి.. ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా రాజు కీలకంగా ఉండేవారని చెప్పారు. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందింది అని చిరు అన్నారు. అందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ స్టెజ్‌పై కామెంట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
