AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కృష్ణంరాజు తనయ

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్‌ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా‌ ద్వారా ప్రభాస్ సోదరి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రభాస్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కృష్ణంరాజు తనయ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 10, 2020 | 8:06 PM

Share

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్‌ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా‌ ద్వారా ప్రభాస్ సోదరి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో ఆమె నటించడం లేదు. ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న వారిలో ఆమె ఒకరు.

వివరాల్లోకి వెళ్తే.. రాధే శ్యామ్‌ ఫస్ట్‌లుక్‌ ఇవాళ విడుదలైంది. అందులో ప్రభాస్‌, పూజా రొమాంటిక్‌ లుక్‌లో దర్శనమివ్వగా.. పోస్టర్‌లో ప్రభాస్ సోదరి ప్రసీదా పేరు కూడా ఉంది. కృష్ణం రాజు పెద్ద కుమార్తె అయిన ప్రసీదా ప్రస్తుతం గోపీకృష్ణ బ్యానర్‌ పనులను చూసుకుంటోంది. ఈ క్రమంలో రాధే శ్యామ్‌ ద్వారా ఆమె సహ నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

కాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న రాధే శ్యామ్‌లో భాను శ్రీ, మురళీ శర్మ, సచిన్‌ కేద్కర్‌, సత్యన్‌, ఎయిర్‌టెల్‌ భామ సాషా ఛత్రీ, కునాల్‌ రాయ్ కపూర్‌లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్‌‌ నిర్మిస్తోన్న ఈ మూవీని గోపీకృష్ణ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పించనున్నారు.

Follow Us
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త