Prabhas Salaar Photo Viral: యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ వరస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. సాహో సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వరసగా మూడు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మరోవైపు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ లో సలార్ సినిమాను మరోవైపు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఓ ఫాంటసీ సిని మాతో పాటు ఆదిపురుష్ వంటి డిఫరెంట్ నేపధ్య కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు..
ఇటీవలే సలార్ సినిమా షూటింగ్ ను ప్రారంభించుకుంది. అయితే ప్రభాస్ ఒకే సారి రెండు సినిమా షూటింగ్స్ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా తొలిసారిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. తెలంగాణలోని గోదావరిఖనిలోని బోగ్గు గనుల సమీపంలో ఈ షూటింగ్ నిర్వహించారు. ఈ షూటింగ్ దాదాపు 10 రోజుల పాటు జరిగింది. ఈ షూటింగ్‌కి సంబంధించిన ఫొటోలు తాజాగా లీక్ అయ్యాయి. ఇందులో బోగ్గు గనుల సమీపంలో ప్రభాస్ బుల్లెట్ బైక్ నడుపుతూ కనిపించాడు.
ప్రభాస్‌తో పాటు సినిమా యూనిట్ కూడా ఈ ఫొటోలలో కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సలార్ సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.
Also Read: