Adipurush Movie Updates: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. నేటి నుంచి ముంబైలో షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు మూవీమేకర్స్‌తోపాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘ఆదిపురుష్ ఆరంభ్’ అంటూ ప్రభాస్ ఈ మేరకు ట్విట్ చేశారు.
ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్లతో పాటు కీలక పాత్రలను ఎవరుచేస్తున్నారన్న విషయంపై మూవీ మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై కూడా మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే ఆదిపురుష్ సినిమాను ఆగస్ట్ 11, 2022న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే.
#Adipurush aarambh. #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/LbHvEFhmFF
— Om Raut (@omraut) February 2, 2021
Also Read:
Ramayanam: రాముడిగా హృతిక్‌రోషన్… సీతగా దీపికా పదుకొణె.. త్రీడీలో రామాయాణం…
Uppena Trailer: నందమూరి హీరో చేతుల మీదుగా విడుదలకానున్న… మెగా హీరో సినిమా ట్రైలర్..?