హాలీవుడ్‌ను మించేలా.. అదరహో ‘సాహో’

దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఎదురుచూసిన ప్రభాస్ మూవీ ‘సాహో’ టీజర్ వచ్చేసింది. ఫుల్ యాక్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అదరహో అనిపిపిస్తోంది. హాలీవుడ్‌ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా వచ్చిన ఈ టీజర్‌తో సాహోపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలోని ప్రతి ప్రధానపాత్రాధారులందరూ టీజర్‌లో దర్శనమిచ్చారు. అలాగే గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి అభిమానులను ఆకట్టుకుంటోన్న ఈ టీజర్‌ సాహోపై అంచనాలను మరింత పెంచేసింది. కాగా ఈ […]

హాలీవుడ్‌ను మించేలా.. అదరహో ‘సాహో’

Edited By:

Updated on: Jun 13, 2019 | 2:01 PM

దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఎదురుచూసిన ప్రభాస్ మూవీ ‘సాహో’ టీజర్ వచ్చేసింది. ఫుల్ యాక్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అదరహో అనిపిపిస్తోంది. హాలీవుడ్‌ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా వచ్చిన ఈ టీజర్‌తో సాహోపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలోని ప్రతి ప్రధానపాత్రాధారులందరూ టీజర్‌లో దర్శనమిచ్చారు. అలాగే గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి అభిమానులను ఆకట్టుకుంటోన్న ఈ టీజర్‌ సాహోపై అంచనాలను మరింత పెంచేసింది.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ఎవిలిన్ శర్మ, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌‌తో నిర్మించిన ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Follow Us