Prabhas Record in Instagram: సినిమా కలెక్షన్లోనే కాదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న ప్రభాస్

|

Jan 27, 2021 | 10:50 AM

రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు ప్రభాస్. వర్షం, ఛత్రపతి, డార్లింగ్ సినిమాలతో అమ్మాయిల కలలు రాకుమారుడుగా మారాడు.. బాహుబలి సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న..

Prabhas Record in Instagram: సినిమా కలెక్షన్లోనే కాదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న ప్రభాస్
Follow us on

Prabhas Record in Instagram: రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు ప్రభాస్. వర్షం, ఛత్రపతి, డార్లింగ్ సినిమాలతో అమ్మాయిల కలలు రాకుమారుడుగా మారాడు.. బాహుబలి సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశ విదేశాలలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఈ హీరోకి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అభిమాన గణం పెరిగిపోయింది. మిగతా హీరోల కంటే సోషల్ మీడియాలోకి ఆలస్యంగా అడుగు పెట్టినా.. జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. అందరికంటే ముందు రికార్డులు తిరగరాస్తున్నాడు.

తాజాగా బాహుబలి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వచ్చిన రికార్డులు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్​కు సోషల్ ​మీడియాలో ఓ ఫాస్టెస్ట్​ రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టిన ఈ బాహుబలి అప్పటి నుంచి తనకు సంబంధించిన ఏ అప్‌డేట్ ని అయినా ఆ పేజీలోని షేర్ చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోయింది. తక్కువ సమయంలోనే 6 మిలియన్ల ఫాలోయర్స్ సొంతం చేసుకున్నాడు. సోషల్ ​మీడియాలో ఇదో వేగవంతమైన ఘనతగా ప్రభాస్​ అభిమానులు హల్‌చల్ చేస్తున్నారు. ఈ మధ్యే ఫేస్​బుక్​ ఖాతాలో 20 మిలియన్ల ఫాలోవర్స్​ను సాధించాడు. అంతలోనే ఇప్పుడు ఇన్‌స్టాలో కూడా 60 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నాడు.

మరోవైపు మూడు భారీ సినిమా ప్రాజెక్ట్ ను చేస్తున్న ప్రభాస్ వాటి అప్ డేట్స్ కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తుంటే ఈ ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరగడం ఖాయం.. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరికి చేరుకుంది. మరోవైపు రామాయణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. ఇక నీల్ సలార్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నది. వీటితో పాటు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సినిమా 2022 లో ప్రారంభం కానున్నది. వీటికి సంబంధించిన వివరాలను ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే ఫాలోవరస్ సంఖ్య ఓ రేంజ్ లో పెరుగుతూనే ఉంటుంది. సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తునే ఉంటాడు..

Also Read: