ప్రభాస్ అభిమానులతో పాటు, యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విదేశాల్లో ఒక రోజు ముందే అంటే జూన్ 26వ తేదీన విడుదల థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. గతంలో ఏ సినిమాకు లేనంతగా విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
కల్కి అడ్వాన్స్ బుకింగ్స్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఓపెన్ చేశారో లేదో అలా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లోకేషన్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపిక పదుకొణె నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..