Devraj Patel: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పాపులర్‌ కమెడియన్‌ దుర్మరణం.. 22 ఏళ్లకే..

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన ప్రముఖ కమెడియన్‌, యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన దేవ్‌ రాజ్‌ పటేల్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఓ షూటింగ్‌కు వెళుతుండగా ఈ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది

Devraj Patel: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పాపులర్‌ కమెడియన్‌ దుర్మరణం.. 22 ఏళ్లకే..
Devraj Patel

Updated on: Jun 27, 2023 | 6:53 AM

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన ప్రముఖ కమెడియన్‌, యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన దేవ్‌ రాజ్‌ పటేల్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఓ షూటింగ్‌కు వెళుతుండగా ఈ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలు కావడంతో దేవ్‌రాజ్‌ మృతి చెందాడు. కాగా ఇతని వయసు కేవలం 22 ఏళ్లే కావడం గమనార్హం. దేవ్‌ రాజ్‌ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సోషల్‌ మీడియా వేదికగా దేవరాజ్‌ పటేల్‌కు నివాళి అర్పించారు.’దిల్ సే బురా లగ్తా హై’తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన దేవరాజ్ పటేల్ ఇవాళ మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతి చిన్న వయసులో తన అద్భుతమైన ట్యాలెంట్‌ను కోల్పోవడం చాలా బాధాకరం. దేవ్‌ రాజ్‌ ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలి. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి.

యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన దేవరాజ్‌ ‘దిల్‌ సే బురా లగ్తా హై’ డైలాగ్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. యూట్యూబ్‌లో 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే దేవరాజ్‌కున్న ఫాలోయింగ్‌ను ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఈక్రమంలోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. దేవరాజ్‌ ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లోని డబ్బుపల్లి అనే ఓ గ్రామంలో నివాసముంటున్నాడు. తండ్రి ఘనశ్యామ్ పటేల్ ఒక సాధారణ రైతు. అతని తల్లి గౌరీ పటేల్ గృహిణి. దేవరాజ్‌కు ఓ సోదరి, సోదరుడు ఉన్నారు. కమెడియన్‌ మరణ వార్తతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయ

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.