Tamil actor Vivek: కమెడియన్ వివేక్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని..

|

Apr 17, 2021 | 2:53 PM

స్టార్ కమెడియన్ వివేక్ మరణం సినిమా ఇండస్ట్రీని తీరని శోకంలోకి నెట్టింది.వివేక్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. శుక్రవారం వివేక్ కు గుండెపోటు రావడంతో చెన్నై లో

Tamil actor Vivek: కమెడియన్ వివేక్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని..
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన 'మనదిల్‌ ఉరుది వేండం' అనే చిత్రంతో వివేక్‌ నటుడిగా ఇండస్ట్రీ ఇచ్చారు. అనంతరం హాస్యనటుడిగా ఆయన ప్రస్థానం అప్రతిహతంగా సాగింది
Follow us on

Tamil actor Vivek: స్టార్ కమెడియన్ వివేక్ మరణం సినిమా ఇండస్ట్రీని తీరని శోకంలోకి నెట్టింది.వివేక్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. శుక్రవారం వివేక్ కు గుండెపోటు రావడంతో చెన్నైలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సనిచ్చిన విద్య సిబ్బంది వివేక్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే వివేక్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని  సినీ ప్రముఖులు, ప్రేక్షకులు దేవుడిని ప్రార్ధించినా ఎవరి కోరిక తీరలేదు. ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. వివేక్ మరణం పై సినిమా, రాజకీయ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. మంచి కమెడియన్ ను మిస్ అయ్యాం. తన కామెడీ టైంగ్ తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఆయన మృతి పట్ల చింతిస్తూ ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు మోడీ. వివేక్ కోలీవుడ్ లో వడివేలు, సెంథిల్, గౌండ్రమణి తర్వాత హాస్యనటుడిగా ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తమిళంలో సుమారు 240 సినిమాల్లో నటించారు. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ కావడంతో ఆ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అపరిచితుడు, శివాజీ, ప్రేమికుల రోజు వంటి అనేక సినిమాలద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Soundarya : సినీవినీలాకాశంలో తారలెన్నున్నా ధ్రువతార మాత్రం సౌందర్యే…

Deepika Pilli: దీపికా పిల్లి బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ…

 

PM Narendra Modi mourns Tamil actor Vivekh’s untimely death.. writing