కరోనా సమయంలో చాలా మందికి కరెంట్ బిల్లులు షాక్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులు మొదలు సెలబ్రిటీలకు పవర్ షాక్‌లు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లులేంటని ఇప్పటికే తాప్సీ, కార్తీక, సందీప్ కిషన్ లాంటి నటీనటులు సోషల్ మీడియాలో ట్వీట్‌లు వేశారు. ఇక తాజాగా బాలీవుడ్ నటుడి అర్షద్ వార్సీకి పవర్ షాక్ తగిలింది. దీంతో తన బాధను సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఓ దినపత్రికలో అర్షద్ వేసిన పెయింటింగ్‌లపై ఆర్టికల్ రాగా.. “దాన్ని పోస్ట్ చేసిన ఈ నటుడు కరెంట్ బిల్లులపై స్పందించారు. ప్లీజ్ నా పెయింటింగ్స్ కొనండి. నేను అదానీ ఎలక్ట్రిసిటీ బిల్లును కట్టాలి. వచ్చే నెల బిల్లు కట్టడం కోసం నా కిడ్నీలను రెడీగా పెట్టుకోవాలి” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక ఆ తరువాత మరో ట్వీట్‌లో “అదానీ ఎలక్ట్రిసిటీ అధికారులు తన సమస్యను పరిష్కరించారని. మీరందరూ కాంటాక్ట్‌లో ఉండండి” అని కామెంట్ పెట్టారు. అయితే అర్షద్‌కి కరెంట్ బిల్లు రూ.1,03,564 వచ్చినట్లు తెలుస్తోంది. కాగా అర్షద్ పెట్టిన ఈ ట్వీట్ నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.
Thank you Rachana & @bombaytimes for the article. People please buy my paintings, I need to pay my Adani electric bill, kidneys am keeping for the next bill ?? pic.twitter.com/ycAaSgxGnR
— Arshad Warsi (@ArshadWarsi) July 5, 2020