ఢిల్లీ హైకోర్టులో కమల్‌కు ఊరట..!

తమిళ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. మహాత్మాగాంధీని కాల్చి చంపిన గాడ్సేని మొదటి హిందూ తీవ్రవాదిగా కమల్ అభివర్ణించడం హిందుత్వవాదులు, రాజకీయనాయకులు, వివేక్ ఓబెరాయ్ వంటి సినీ నటులు తీవ్రంగా తప్పుబట్టారు. మరో వైపు కమల్ ఎన్నికలలో లబ్ది పొందడానికి  మతవైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలు చేయడం జరిగింది. దీనిపై […]

ఢిల్లీ హైకోర్టులో కమల్‌కు ఊరట..!

Edited By: Ram Naramaneni

Updated on: May 16, 2019 | 8:53 PM

తమిళ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. మహాత్మాగాంధీని కాల్చి చంపిన గాడ్సేని మొదటి హిందూ తీవ్రవాదిగా కమల్ అభివర్ణించడం హిందుత్వవాదులు, రాజకీయనాయకులు, వివేక్ ఓబెరాయ్ వంటి సినీ నటులు తీవ్రంగా తప్పుబట్టారు.

మరో వైపు కమల్ ఎన్నికలలో లబ్ది పొందడానికి  మతవైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలు చేయడం జరిగింది. దీనిపై నియమించిన జి. ఎస్ శిస్తాని మరియు జ్యోతి సింగ్‌ల కమిటీ ఈ పిల్‌ను విచారణకు నిరాకరించడంతో కమల్‌కి ఊరట లభించింది.