Pelli Sandadi Movie: పాతికేళ్ళు పూర్తిచేసుకున్న ‘పెళ్ళి సందడి’.. ట్వీట్ చేసిన దర్శకేంద్రుడు..

|

Jan 12, 2021 | 2:13 PM

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కెరీర్‏లోనే ఆల్‏టైం హిట్‏గా నిలిచిన సినిమా 'పెళ్ళి సందడి'. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీసిన సినిమాలో పెళ్ళి సందడి మంచి విజయం సాధించింది.

Pelli Sandadi Movie: పాతికేళ్ళు పూర్తిచేసుకున్న పెళ్ళి సందడి.. ట్వీట్ చేసిన దర్శకేంద్రుడు..
Follow us on

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కెరీర్‏లోనే ఆల్‏టైం హిట్‏గా నిలిచిన సినిమా ‘పెళ్ళి సందడి’. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీసిన సినిమాలో పెళ్ళి సందడి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు తన ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు.

” నేటికి పెళ్ళి సందడి సినిమా విడుదలయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్‏లో, శ్రీకాంత్ కెరీర్‏లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్‏లకు నమస్కరిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అయితే ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్ హిట్‏గా నిలిచారు. ఇప్పటీకి ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాయి. ఇక ఇందులో శ్రీకాంత్ హీరోగా నటించగా.. రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించారు.

దర్శకేంద్రుని ట్వీట్..

Also Read:  దర్శకేంద్రుడి కొత్త ‘పెళ్లిసందడి’లో కీలక పాత్రలో హీరో శ్రీకాంత్.. ఆ రోల్ కోసమే తీసుకున్నారా..?

‘పెళ్లి సందడి’ సీక్వెల్ దర్శకుడు తనికెళ్ల భరణి కాదు, మరి ఎవరో తెలుసా..? ఇంట్రస్టింగ్ అప్టేట్